Home > తెలంగాణ > మామా..ఇటుకలో బిర్యానీ తిందామా..?

మామా..ఇటుకలో బిర్యానీ తిందామా..?

మామా..ఇటుకలో బిర్యానీ తిందామా..?
X

చికెన్ బిర్యానీ అనగానే అందరి నోరు ఊరుతుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే లొట్టలేసుకుని మరి బిర్యానీని లాగించేస్తుంటారు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే వప్రపంచవ్యాప్తంగా వెరీ వెరీ ఫేమస్. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అకేషన్ ఏదైనా, ఇంటికి ఎవరు వచ్చినా, ఫ్రెండ్స్‎తో చిల్ అవ్వాలన్నా బిర్యానీ మస్ట్. అందుకే బిర్యానీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఒక్కో రెస్టారెంట్ బిర్యానీలో ఒక్కో ప్రయోగం చేస్తోంది. ఇప్పటి వరకు

దమ్‌ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ వంటి ప్రయోగాలు మనకు తెలుసు. ఇప్పుడు లేటెస్టుగా బ్రిక్‌ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. ఇటుక బిర్యానీ అంటే ఇటుక పొయ్యి మీద చేసే బిర్యానీ అనుకుంటే పొరపాటే. ఇటుకలో బిర్యానీ చేస్తారు. అదే ఈ డిష్ స్పెషాలిటీ.

ఇటుకతో తయారు చేసిన ఓ రెక్టాంగిల్ పాత్ర తీసుకుని అడుగున నెయ్యి రాసి, బిర్యానీకి అవసరమైన అన్ని ఇంగ్రేడియంట్స్‎ను వేసి మూత పెట్టి ఉడికిస్తే.. ఘుమఘుమలాడే బ్రిక్‌ బిర్యానీ రెడీ. ఇలాంటి బిర్యానీ ఎక్కడ లభిస్తుందని అని వెతికేయకండి. హైదరాబాద్‌ కొంపల్లిలోనే ఈ బ్రిక్ బిర్యానీ టేస్ట్ చూసేయొచ్చు. దీని కాస్ట్ కూడా మిగతా బిర్యానీలతో పోల్చితే తక్కువే. కేవలం రూ. 189 కే బిర్యానీ కస్టమర్లకు అందుబాటులో ఉంది. వింటేనే నోరూరుతోంది కదూ.. నిజానికి ఈ ఇటుక బిర్యానీ భోజన ప్రియులను తెగ నచ్చేస్తోందట. రుచి చూసిన వాళ్లంతా ఆహా ఓహో సూపర్‌ టేస్ట్ అంటూ తెగ పొగుడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఇటుక బిర్యానీని మీరూ లాగించేయండి.

Updated : 27 Aug 2023 1:43 PM IST
Tags:    
Next Story
Share it
Top