Nizamabad BRS MP Ticket: కవిత ఎంపీ టికెట్పై కార్యకర్తల డిమాండ్.. కానీ అధిష్టానం మాత్రం..?
X
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త జోరుగా వినిపిస్తుంది. ఈసారి నిజామాబాద్ ఎంపీ టికెట్ కల్వకుంట్ల కవితకు ఇచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. నిజామాబాద్ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన నిజామాబాద్ లోక్ సభ సన్నాహక సమావేశంలో.. స్థానిక లీడర్లంతా కవితకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2019లో జరిగిన ఎలక్షన్స్ లో కవిత ఓడిపోయిన తర్వాత.. దానికి గల కారణాలను సమీక్షించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని నాయకులు మండిపడ్డారు. లోక్‌సభ టికెట్ కవితకే ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నా.. పార్టీ అధిష్టానం మాత్రంఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
కరీంనగర్, చేవెళ్ల, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థులుగా వినోద్‌కుమార్, రంజిత్‌రెడ్డి, నామా నాగేశ్వర్రావుల పేర్లను.. ఇప్పటికే ఆయా లోక్ సభ సన్నాహక సమావేశాల్లో ప్రతిపాదించారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ కవితకు ఇవ్వాలని మెజారిటీ సభ్యులు అధిష్టానాన్ని కోరారు. సమవేశానికి హాజరైనవారు కూడా ఇదే విషయాన్ని రాతపూర్వకంగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ అధిష్టానంమాత్రం కవితను లోక్‌సభకు పోటీ చేయించే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తోంది.