Home > తెలంగాణ > బీఆర్ఎస్, బీజేపీ ఎన్నటికీ ఒక్కటి కాదు..ఈటల రాజేందర్

బీఆర్ఎస్, బీజేపీ ఎన్నటికీ ఒక్కటి కాదు..ఈటల రాజేందర్

బీఆర్ఎస్, బీజేపీ ఎన్నటికీ ఒక్కటి కాదు..ఈటల రాజేందర్
X

వరంగల్ పర్యటనలో భాగంగా..ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని విష ప్రచారాలు చేసినా, ఆరునూరైనా బీజీపీ పార్టీ జెండా తెలంగాణలో ఎగురుతుందని అన్నారు.

"30 ఏళ్ల తరువాత మోదీ వరంగల్‎కు వచ్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచకం. ఉత్తర తెలంగాణ గుండెకాయ ఓరుగల్లు గడ్డ మీద వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలను నిర్మించారు. ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న వ్యాగన్ల రైల్వే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తప్పకుండా మీ వెంట ఉంటామని, తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుంటామన్న భరోసా ఇవ్వడానికే మోదీ హన్మకొండకు వచ్చారు. ఇక్కడున్న ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకుంటున్నారు. ఆ బాధ్యత బీజేపీ నిర్వహించాలి. దానికి అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర పార్టీ అందించాలి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల సందర్భంగా స్వయంగా మోదీ గారు మన దేశ అధ్యక్షులు నడ్డా గారికి సూచనలు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆరునూరైనా గెలవాల్సింది బీజేపీ పార్టీ మాత్రమే . కాషాయ జెండా మాత్రమే తెలంగాణలో ఎగరాలని అమిత్ షాకు ఆదేశాలు అందించారు. బీఆర్ఎస్ , బీజేపీ ఒకటే అని చెప్పి కొన్ని ఛానళ్లు విష ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ , బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదు. నిండు మనసుతో ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజల బతుకులు, కన్నీళ్లు తెలిసిన బిడ్డగా నేను కోరుతున్నాను"అని ఈటల అన్నారు.




Updated : 8 July 2023 7:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top