మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
X
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ తాజాగా ప్రకటనను విడుదల చేసింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ బరిలో నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలకుగాను బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఇంకా నాలుగు స్థానాలకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే పార్టీ నేతలతో చర్చల అనంతరం గులాబీ బాస్ ఆ సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.