Home > తెలంగాణ > కేసీఆర్కు ఆహ్వానం.. రేవంత్ ప్రమాణస్వీకారానికి వస్తారా..?

కేసీఆర్కు ఆహ్వానం.. రేవంత్ ప్రమాణస్వీకారానికి వస్తారా..?

కేసీఆర్కు ఆహ్వానం.. రేవంత్ ప్రమాణస్వీకారానికి వస్తారా..?
X

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, టీడీపీ అధినేత చంద్రబాబులకు ఇన్విటేషన్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీడియాకు కనిపించలేదు. ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడిన రోజే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను సైతం అక్కడే కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పటి వరకు ఆయన రాకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఈ క్రమంలో రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాకపోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పట్లో ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశంలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated : 6 Dec 2023 8:27 PM IST
Tags:    
Next Story
Share it
Top