Home > తెలంగాణ > నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం

నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం

నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం
X

దీపావళి పండుగ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి​.. ప్రచారం ఆఖరి రోజు వరకు నిర్విరామంగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. నవంబర్ 30న ఎన్నికలు కాబట్టి.. నవంబర్ 28తో ప్రచారం ముగుస్తుంది. అందుకే కేసీఆర్ ఈ 16 రోజుల్లో గ్యాప్ లేకుండా ప్రచారం సాగించేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజులు మినహా.. మిగిలిన రోజుల్లో నాలుగు, మూడు నియోజకవర్గాలను గులాబీ దళపతి చుట్టేయనున్నారు. నేడు పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, నర్సంపేట నియోజకవర్గాలు కలిపి.. బూర్గంపాడు, దమ్మపేట, నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొననున్నారు. ఆయా నియోజకవర్గాల బీఆర్​ఎస్(BRS)​ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా.. రెండు బహిరంగ సభల్లో పాల్గొంటారు.

కేసీఆర్ ముందుగా అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం నేరుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్​లో కేసీఆర్ దిగి బహిరంగ సభలో పాల్గొంటారు. అశ్వారావుపేట సభ అనంతరం.. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొంటారు

కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే:

నవంబర్ 13 - దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట

నవంబర్ 14 - పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం.

నవంబర్ 15 - బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్

నవంబర్ 16 - ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్

నవంబర్ 17 - కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల

నవంబర్ 18 - చేర్యాల

నవంబర్ 19 - అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి

నవంబర్ 20 - మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ

నవంబర్ 21 - మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట

నవంబర్ 22 - తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి

నవంబర్ 23 - మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు

నవంబర్ 24 - మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి

నవంబర్ 25 - హైదరాబాద్‌

నవంబర్ 26 - ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక

నవంబర్ 27 - షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి

నవంబర్ 28 - వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వేల్‌

Updated : 13 Nov 2023 7:48 AM IST
Tags:    
Next Story
Share it
Top