సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్లో స్వల్ప మార్పు
X
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అధినేత నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. దసరా అనంతరం తిరిగి అక్టోబర్ 26 నుంచి ప్రచారం ప్రారంభించనున్న కేసీఆర్.. నవంబర్ 9 వరకు క్యాంపెయినింగ్ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో ఈనెల 26, 27 తేదీల్లో కేసీఆర్ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి.
వాస్తవానికి అక్టోబర్ 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. కానీ ఆ రోజున నాగర్ కర్నూలు బదులు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో పాల్గొంటారు.
షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ అక్టోబర్ 27న పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉండగా.. పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో నిర్వహించే సభలో పాల్గొంటారు. స్టేషన్ ఘన్ పూర్ వివాదం సద్దుమణగడంతో దానికి బదులు మహబూబాబాద్తో పాటు వర్దన్నపేటలో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేస్తోంది.
సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్..
అక్టోబర్ 26 - అచ్చంపేట, వనపర్తి, మునుగోడు
అక్టోబర్ 27 - పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట
అక్టోబర్ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్ 30 - జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్
అక్టోబర్ 31 - హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్ 01 - సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్ 02 - నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
నవంబర్ 03 - భైంసా(ముధోల్), ఆర్మూర్, కోరుట్ల
నవంబర్ 05 - కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్ 06 - గద్వాల్, మఖ్తల్, నారాయణపేట
నవంబర్ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్ 08 - సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
ఇదిలా ఉంటే నవంబర్ 9నే బీఆర్ఎస్ అధినేత గజ్వేల్లో మధ్యాహ్నం 1 - 2 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో రెండో నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.