Home > తెలంగాణ > BRS B-Forms: 51 మందికే బీఫామ్లు ఇవ్వడం వెనుక మతలబేంటి?

BRS B-Forms: 51 మందికే బీఫామ్లు ఇవ్వడం వెనుక మతలబేంటి?

BRS B-Forms: 51 మందికే బీఫామ్లు ఇవ్వడం వెనుక మతలబేంటి?
X

అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన ఆయన.. ఆదివారం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పనిలో పనిగా అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు. అయితే ఫస్ట్ లిస్టులో 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కేసీఆర్.. బీఫాంలు మాత్రం కేవలం 51 మందికి మాత్రమే ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. మిగిలిన స్థానాల అభ్యర్థుల పరిస్థితి ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ బీఫామ్లు అందుకున్న అభ్యర్థులు

1. కోనేరు కోనప్ప

2. దుర్గం చిన్నయ్య

3. ఎన్.దివాకర్ రావు

4. కోవ లక్ష్మి

5. భూక్యా జాన్సన్ నాయక్

6. జోగు రామన్న

7. అనిల్ జాదవ్

8. ఇంద్రకరణ్ రెడ్డి

9. విట్టల్ రెడ్డి

10. కె.చంద్ర శేఖర్ రావు

11. షకీల్

12. హనుమంత్ షిండే

13. పోచారం శ్రీనివాస్ రెడ్డి

14. జె.సురేందర్

15. బి.గణేష్ గుప్తా

16. బాజిరెడ్డి గోవర్ధన్

17. వి. ప్రశాంత్ రెడ్డి

18. పట్నం నరేందర్ రెడ్డి

19. ఎస్.రాజేందర్ రెడ్డి

20. డా.సి.లక్ష్మారెడ్డి

21. ఎ. వెంకటేశ్వర్ రెడ్డి

22. వి. శ్రీనివాస్ గౌడ్

23. సీహెచ్. రామ్మోహన్ రెడ్డి

24. ఎస్.నిరంజన్ రెడ్డి

25. బి. కృష్ణ మోహన్ రెడ్డి

26. మర్రి జనార్దన్ రెడ్డి

27. గువ్వల బాలరాజు

28. జైపాల్ యాదవ్

29. అంజయ్య యాదవ్

30. బి.హర్ష వర్ధన్ రెడ్డి

31. పద్మ దేవేందర్ రెడ్డి

32. ఎం.భూపాల్ రెడ్డి

33. చంటి క్రాంతి కిరణ్

34. జి. మహిపాల్ రెడ్డి

35. కె. ప్రభాకర్ రెడ్డి

36. రేగా కాంత రావు

37. హరిప్రియ నాయక్

38. పువ్వాడ అజయ్ కుమార్

39. కె. ఉపేందర్ రెడ్డి

40. ఎల్. కమల్ రాజ్

41. బానోత్ మదన్ లాల్

42. వనమా వెంకటేశ్వర్ రావు

43. ఎస్. వెంకట వీరయ్య

44. మెచ్చా నాగేశ్వర్ రావు

45. తెల్లం వెంకట్ రావు

46. పైళ్ల శేఖర్ రెడ్డి

47. కేటీఆర్

48. పల్లా రాజేశ్వర్ రెడ్డి

49. టి. హరీష్ రావు

50. ఎ. జీవన్ రెడ్డి

51. బాల్క సుమన్

సీఎం కేసీఆర్ కేవలం 51 మంది అభ్యర్థులకే బీఫామ్స్ అందజేయటంతో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అందరి బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలదేని సోమవారం మిగిలిన వారికి ఇస్తామని చెప్పినా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు నెలల క్రితమే 115 మందితో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను కేసీఆర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్లో మిగిలిన 4 స్థానాలతో కలిపి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్‌లు ఇస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

ఇదిలా ఉంటే బీఫామ్స్ అందని అభ్యర్థుల్లో కొందరిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు కేసీఆర్ దృష్టికి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ బీఆర్ఎస్ అధినేత మాత్రం బీ ఫామ్స్పై తాను సంతకం పెట్టాల్సి ఉందని సోమవారం అందరికీ ఇస్తామని అంటున్నారు. మొత్తమ్మీద దీనిపై స్పష్టత రావాలంటే సోమవారం వరకు వేచిచూడాల్సిందే.

Updated : 15 Oct 2023 12:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top