Home > తెలంగాణ > 119 మంది అభ్యర్థులతో కేసీఆర్ జాబితా రెడీ!

119 మంది అభ్యర్థులతో కేసీఆర్ జాబితా రెడీ!

119 మంది అభ్యర్థులతో కేసీఆర్ జాబితా రెడీ!
X

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలు దగ్గర్లో ఉండడంతోపాటు ఈసీ అధికారులు కూడా ఏర్పాట్లకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన అభ్యర్థులను జాబితాకు ఒక రూపు తెచ్చారని సమాచారం. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేశారని, పది రోజుల్లో ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 80 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చారని, 8 నుంచి 15 మందిని మార్చారని సమాచారం.

మూడోసారి..

2014, 2018 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్ కోసం పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు మళ్లీ అధికారం కట్టబెడతాయనే ధీమాతో సిట్టింగులవైపే మొగ్గుచూపుతున్నారు. అవినీతి, అనుచిత ప్రవర్తనలతో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతోపాటు, గెలవరని భావిస్తున్న పదిమందికిపైగా ఎమ్మెల్యేలకు ఈ సారి నో చెప్పినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తవారికి, గతంలో అవకాశం దక్కనివారితోపాటు రాష్ట్ర అవసరాల కోసం ఎంపీల్లో కొందరికి టికెట్లు ఇవ్వొచ్చని చెబుతున్నారు.

ముందస్తు..

2018 ముందుస్తు ఎన్నికల్లో కేసీఆర్ అసెంబ్లీ రద్దుతోపాటు ఒకేసారి 105 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు షెడ్యూలు ప్రకారం 2024, జనవరి 16తో ముగియనుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలురించకముందే అభ్యర్థులను, పార్టీ శ్రేణులను యుద్ధానికి సన్నద్ధం చేయడానికి గులాబీ దళపతి ఈసారి కూడా చాలా ముందే జాబితాను వెలువరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతోపాటు జాతీయ ఎన్నికలకు కూడా శ్రేణులను సిద్ధం చేయడానికి కేసీఆర్ చాలా ముందుగానే కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. హ్యాట్రిక్‌పై ధీమాతో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఊపుతో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండడానికి, ఎంపీ అభ్యర్థుల విషయంలో ముందుస్తు నిర్ణయానికి రావడానికి జాబితా రూపకల్పనకు ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్గత, బహిర్గత సర్వేల ద్వారా ప్రజానాడి తమకే అనుకూలంగా ఉందన్న భరోసాతో అభ్యర్థులపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరీ తప్పనిసరైతే తప్ప ఐదారుగురి పేర్లను మార్చడం మినహా దాదాపు తొలి జాబితానే తుది జాబితా కావొచ్చుని చెబుతున్నారు. అసంతృప్తులను కాస్త ముందునుంచీ బుజ్జిగించి చివరి నిమిషంలో తిరుగుబాట్లు లేవకుండా అరికట్టకడం కూడా ఇందులో భాగమని, అప్పటికీ రెబళ్లు మాటన వినకపోతే ప్రత్యమ్నాయాలకు ముందునుంచే సిద్ధం కావడానికి బహుముఖ వ్యూహంతో జాబితాను రూపొందిస్తున్నారు.


Updated : 24 Jun 2023 10:34 PM IST
Tags:    
Next Story
Share it
Top