Home > తెలంగాణ > గురువారం నుంచి మళ్లీ ప్రచారం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

గురువారం నుంచి మళ్లీ ప్రచారం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

గురువారం నుంచి మళ్లీ ప్రచారం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో ప్రచారం గురువారం నుంచి మళ్లీ ప్రారంభంకానుంది. నవంబర్ 9 వరకు ఆయన ప్రచారం కొనసాగించనున్నారు. కేసీఆర్ గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడు సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. సీఎం ఎన్నికల ప్రచారం సభల షెడ్యూల్లో వనపర్తి లేకపోయినా 26వ తేదీ వనపర్తి సభకు హాజరయ్యేలా షెడ్యూల్లో మార్పు చేశారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్..

అక్టోబర్ 26 - అచ్చంపేట, వనపర్తి, మునుగోడు

అక్టోబర్ 27 - పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట

అక్టోబర్‌ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్‌ 30 - జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌

అక్టోబర్‌ 31 - హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్‌ 01 - సత్తుపల్లి, ఇల్లెందు

నవంబర్‌ 02 - నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

నవంబర్‌ 03 - భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల

నవంబర్‌ 05 - కొత్తగూడెం, ఖమ్మం

నవంబర్‌ 06 - గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట

నవంబర్‌ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్‌ 08 - సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

ఇదిలా ఉంటే నవంబర్‌ 9నే బీఆర్ఎస్ అధినేత గజ్వేల్లో మధ్యాహ్నం 1 - 2 గంటల మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో రెండో నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

BRS chief kcr to attend praja ashirvada sabha in wanaparthy on thursday

Telangana,ts election,ts politics,assembly election,brs party,brs chief kcr,kcr election campaign,kcr schedule,october 26, nagarkurnool,munugodu,acchampet,station ghanpur,wanaparthy,munugodu,paleru,mahbubabad,wardhannapet,gajwel,kcr nomination,kamareddy

Updated : 25 Oct 2023 4:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top