కర్ర సాయంతో నడుస్తోన్న కేసీఆర్.. వీడియో వైరల్
X
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారు. డిసెంబర్లో బాత్రూమ్‌లో జారిపడి తుంటి ఎముక విరగ్గా.. వైద్యులు సర్జరీ చేశారు. అప్పటి నుంచి ఆయన బెడ్కే పరిమితమయ్యారు. ఆస్పత్రిలో ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా కొంతమంది ప్రముఖులు పరామర్శించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నందినగర్లోని నివాసంలో రెస్ట్ తీసుకున్నారు. అప్పుడు ఏపీ సీఎం జగన్, మాజీ గవర్నర్ నరసింహన్ కేసీఆర్ను పరామర్శించారు. కొన్ని రోజుల క్రితమే ఆయన తిరిగి ఫాంహౌస్కు వెళ్లారు.
ప్రస్తుతం కేసీఆర్ ఫాంహౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కర్ర సాయంతో నడుస్తోన్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిని ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘ప్రతి అడుగుతో మరింత బలాన్ని పొందుతున్నారు. ధృడ సంకల్పంతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు’’ అని సంతోష్ రాసుకొచ్చారు. కేసీఆర్ నడుస్తుండడం చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు త్వరలోనే తిరిగి వస్తారని సంతోషిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా కర్ర సాయంతో మీరు నడవడం చూడలేకపోతున్నాం సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.