Home > తెలంగాణ > KCR: ముహూర్తం ఫిక్స్ .. రేపే కేసీఆర్ ప్రమాణ స్వీకారం..

KCR: ముహూర్తం ఫిక్స్ .. రేపే కేసీఆర్ ప్రమాణ స్వీకారం..

KCR: ముహూర్తం ఫిక్స్ .. రేపే కేసీఆర్ ప్రమాణ స్వీకారం..
X

మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక గాయం కారణంగా ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ అప్పటినుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగానే ఇప్పటివరకూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.

ఇటీవలే ఆయన కుమారుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేసీఆర్ ప్రమాణస్వీకారం విషయంపై స్పష్టత ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ ఎమ్మేల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. అందుకోసం మంచి ముహూర్తం చూసి తేదీ నిర్ణయిస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రమాణస్వీకారానికి రేపు మధ్యాహ్నం ముహూర్తం ఖరారు చేశారు.

రేపు ( గురువారం ) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు స్పీకర్ ఛాంబర్ లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు 12గంటలకే అసెంబ్లీకి చేరుకోనున్న కేసీఆర్ నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.ఎల్ఓపి నేతగా భాద్యతలు స్వీకరించనున్నారు

Updated : 31 Jan 2024 9:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top