విఠల్, రుక్మిణిలను దర్శించుకున్న కేసీఆర్..
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర రెండో రోజు పర్యటన జోరుగా సాగుతోంది. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలను కలుస్తూ ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం ఆయన షెడ్యూలు ప్రకారం సోలాపూర్ నుంచి ప్రఖ్యాత శైవక్షేత్రం పండరీపూర్ చేరుకున్నారు. అక్కడి రుక్మిణదేవీ సమేత విఠలేశ్వరుడి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, రైతులను చల్లగా చూడాలని ప్రార్థించారు. ఆయన పురోహితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకుని స్వామికి కానుకలు సమర్పించారు. కేసీఆర్‌ను చూడటానికి భక్తులు ఆసక్తి చూపారు. కేసీఆర్ మధ్యాహ్నం మూడు గంటలకు తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్తారు.
సర్కోలీలో బహిరంగ సభ
కేసీఆర్ పండరీపూర్ దగ్గర్లోని సర్కోలీ ఆలయంలో సాయంత్రం బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మహరాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడానికి తలపెట్టిన ఈ సభలో పలువులు మరాఠా నాయకులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. మహారాష్ట్ర పర్యటన కోసం కేసీఆర్ 600 కార్లతో భారీ బలప్రదర్శన చేస్తూ సోమవారం ప్రగతి భవన్ నుంచి బయల్దారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఆయన ప్రయాణించే మార్గోం భారీ ఫ్లెక్సీలు, తోరణాలు కట్టి ఘనంగా స్వాగతం పలికారు.