Home > తెలంగాణ > రేవంత్ రెడ్డిని ప్రచారానికి దూరం పెట్టండి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు..

రేవంత్ రెడ్డిని ప్రచారానికి దూరం పెట్టండి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు..

రేవంత్ రెడ్డిని ప్రచారానికి దూరం పెట్టండి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు..
X

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హింస చెలరేగేలా రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమాభరత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సీఈవో వికాస్ రాజ్‌ను కలిసింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చట్టాన్ని గౌరవించడం లేదని ఈసీకి తెలిపింది.

రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఈసీకి నాలుగు ఫిర్యాదులు చేసినట్లు సోమా భరత్ తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారని చెప్పారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ప్రచారానికి దూరం పెట్టాలని తాము ఈసీని కోరినట్లు చెప్పారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని వివరించారు.

Updated : 20 Nov 2023 9:11 PM IST
Tags:    
Next Story
Share it
Top