Home > తెలంగాణ > ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీజేపీ మేనిఫెస్టో - బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీజేపీ మేనిఫెస్టో - బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీజేపీ మేనిఫెస్టో - బీజేపీ ఎంపీ లక్ష్మణ్
X

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీలు కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల మంచి కోరేవి కావని అన్నారు. పదేళ్లలో ఒక్క కార్డు ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు వాటి గురించి ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లలో చేయని పనులు 10 రోజుల్లో చేస్తానంటే ప్రజలెవరూ నమ్మరని అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని లక్ష్మణ్ ఆరోపించారు. అందుకే ఆ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరో గమనించి వారికి ఓటు వేయాలని లక్ష్మణ్ సూచించారు. నవంబర్ 17న విడుదల చేయనున్న బీజేపీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పారు.

Updated : 14 Nov 2023 3:09 PM IST
Tags:    
Next Story
Share it
Top