Home > తెలంగాణ > ప్లాన్ మార్చిన కారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు పడకుండా స్కెచ్..!

ప్లాన్ మార్చిన కారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు పడకుండా స్కెచ్..!

ప్లాన్ మార్చిన కారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు పడకుండా స్కెచ్..!
X

బీఆర్ఎస్ పార్టీ గేరు మార్చింది. ఎన్నికల వ్యూహాల్లో ప్లాన్ చేంజ్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకు బీజేపీ ఓట్లపైనే కారు పార్టీ ఆశలుపెట్టుకుంది. ఆ ఓట్లు కారుకు పడితే ఎన్ని స్థానాల్లో బలపడితే అంత లాభమని భావిస్తుంది. కాంగ్రెస్ పై విమర్శలు పెంచి బీజేపీ ఓట్లశాతం పెంచేందుకు పరోక్షంగా చర్యలు చేపడుతుందనే టాక్. బీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీకి ఓట్లు ఎంత ఎక్కువపడితే అంత ప్లస్ అని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, హరీశ్ రావు, కేటీఆర్, కవిత కూడా నియోజకవర్గాల్లో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ.. ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. అయినా కొన్నిచోట్ల పార్టీపై వ్యతిరేకత తగ్గడంలేదు. దీనికితోడు కాంగ్రెస్ కు సానుకూలత పెరుగుతోంది. దీంతో బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ కు కాకుండా బీజేపీవైపు మళ్లించే పనిలో పడింది. అందులో భాగంగా బీజేపీపై విమర్శలకు పదును పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో వ్యతిరేకత పెరిగిందని అర్థం అవుతుంది. దీనికి తోడు నిరుద్యోగం, పేపర్ లీకేజీలతో యవతలో కూడా బీఆర్ఎస్ పై అసంతృప్తి ఏర్పడింది. దీంతో గులాబి నేతల్లో కమలంపై చర్చమొదలైంది. బీజేపీ గ్రాఫ్ తగ్గడంతోనే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. అందుకే తమ పార్టీకి వ్యతిరేకత ఉన్నచోట్ల బీజేపీని విమర్శిస్తున్నారు. దాంతో తమకు వ్యతిరేకంగా ఉన్న వారు బీజేపీకి ఓటువేసి.. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిస్తారనే ప్లాన్ ఓ కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటే అంత బీఆర్ఎస్‌కు కలిసి వస్తుందని, లేకుంటే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తుగా పడకూడదనేది బీఆర్ఎస్ స్కెచ్.

Updated : 19 Nov 2023 9:16 AM IST
Tags:    
Next Story
Share it
Top