కేసీఆర్ బర్త్డే గిఫ్ట్.. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఇన్సూరెన్స్
X
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆ పార్టీ ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించనున్నట్లు తెలిపింది. దీంతో పాటు శారీరక వికలాంగులకు వీల్ చైర్లు అందించనున్నట్లు తెలిపింది. కేసీఆర్ జీవితంపై ‘తానే ఒక చరిత్ర’ పేరుతో 30నిమిషాల డాక్యుమెంటరీని తెలంగాణ భవన్ లో ప్రదర్శించనున్నారు. కేసీఆర్ చిన్ననాటి నుంచి ఇటీవల నల్గొండలో జరిపిన ఛలో నల్గొండ సభ వరకు ఆ డాక్యుమెంటరీలో ఉంటుంది. దీంతో పాటు 70వ పుట్టిన రోజు సందర్భంగా 70కేజీల కేక్ ను తెలంగాణ భవన్ లో కట్ చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 17న ఉదయం 9:30 నుంచి పలు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్యాడర్ తో సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా వేడుకల్లో పాల్గొంటారు.