'స్టోరీలు అల్లే పొలిటికల్ టూరిస్టులు.. ఇది తెలుసుకోవాలి': మంత్రి కేటీఆర్ ట్వీట్
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి...BRS తో పొత్తు పెట్టుకోవాలని ఎన్నో పార్టీల నుంచి అనేక అభ్యర్థనలు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. BRS ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ను ఓడించేందుకు గతంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి పనిచేశాయని ఆయన గుర్తు చేశారు.బీజేపీ అంటే బిగ్గెస్ట్ ఝూటా పార్టీ అని.. 2018లో ఆ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వచ్చి బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని తెలిపారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఢిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారా? అని ప్రశ్నించారు. అప్పుడే బీజేపీ చేసిన ఆఫర్‌ను బీఆర్‌ఎస్ తిరస్కరించిందని స్పష్టం చేశారు.
అప్పట్లో కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తాకథనాలను కూడా ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. సెలెక్టివ్ అమ్నేషియాతో బాధపడుతూ.. ఇష్టం వచ్చినట్లు స్టోరీలు అల్లే పొలిటికల్ టూరిస్టులు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. 105 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం మాకు లేదన్నారు. జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉండగా.. బీజేపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మేం ఫైటర్స్.. చీటర్స్ కాదు అని స్పష్టం చేశారు.