పార్టీ మారట్లేదు... రేవంత్‌ను కలవలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్
X
తను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. అవన్నీ అబద్ధాలని, ఎవరో దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా కలవలేదని, రేవంత్‌తో ఎప్పుడో దిగిన పాత ఫోటోను పెట్టి ప్రచారం చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ హుజూరాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై పోటీ చేసి గెలిచారు. గులాబీ జెండా పార్టీ ఓడిపోవడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరతాని వార్తలు వస్తున్నాయి. కౌశిక్, రేవంత్‌ల ఫోటో కలకలం రేపుతోంది. దీనిపై కౌశిక్ స్పందిస్తూ.. ‘‘నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌లోనే ఉంటాను. కేసీఆర్ విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేనదు. ఫేక్ వీడియోలు, ఫోటోలతో ప్రచారం చేస్తున్నారు. దయచేసి నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు వాటి నమ్మొద్దని కోరుతున్నారు. నాపై విశ్వాసం ఓట్లు వేసి గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు నేను ద్రోహం చేయలేను. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను’’ అని చెప్పారు.