Home > తెలంగాణ > నాకు హామీ ఇచ్చి.. వేరే అభ్యర్థికి బీ ఫాం ఇచ్చారు.. సి.కృష్ణాయాదవ్‌

నాకు హామీ ఇచ్చి.. వేరే అభ్యర్థికి బీ ఫాం ఇచ్చారు.. సి.కృష్ణాయాదవ్‌

నాకు హామీ ఇచ్చి.. వేరే అభ్యర్థికి బీ ఫాం ఇచ్చారు.. సి.కృష్ణాయాదవ్‌
X

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్‌ శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. . ఆత్మాభిమానాన్ని చంపుకొని బీఆర్‌ఎస్‌లో ఉండలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ‘అంబర్‌పేట టికెట్‌ ఇస్తామని 2018లో కేసీఆర్‌ హామీ ఇచ్చి.. వేరే అభ్యర్థికి బీ ఫాం ఇచ్చారు. అయినా పార్టీలోనే ఉన్నా. కానీ, ఈసారి కూడా ఇవ్వలేదు. ఆ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని అర్థమైంది. భూస్వాములకు, పెత్తందారులకు, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించే పార్టీలో ఒక బీసీ నాయకుడిగా కొనసాగడం సరికాదనే నిర్ణయానికి వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నా’ అని తెలిపారు. ఏ పార్టీ బీసీలకు అవకాశం కల్పిస్తుందో అందులో చేరతానన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ సమక్షంలో కృష్ణాయాదవ్‌ బీజేపీలో చేరతారని సమాచారం. అంబర్‌పేట నియోజకవర్గం టికెట్‌ ఇస్తామని బీజేపీ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

కేసీఆర్​ పిలుపు మేరకు తెలుగురాష్ట్రాలు విడిపోయాక జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్​ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా పార్టీలో చేరారు సి.కృష్ణాయాదవ్‌. ఏ బాధ్యత అప్పజెప్పినా తన వంతు బంగారు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వంలో ఒక సైనికుడిగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో తనకు టికెట్​ రాకున్నా రెబల్​ అభ్యర్థిగా మారకుండా అంబర్​పేట్​ నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్​రెడ్డిని ఓడించి టీఆర్​ఎస్​ అభ్యర్థి కాలేరు వెంకటేష్​ గెలుపుకు కీలక పాత్ర పోషించారు​. అయితే.. రెండవసారి కూడా బీఆర్ఎస్ టికెట్ వస్తుందేమోనని ఆఖరి నిమిషం వరకూ వేచి చూసిన ఆయన.. అధిష్టానం ఇవ్వకపోవడంతో ఈ నెల 30న బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.


Updated : 27 Aug 2023 7:44 AM IST
Tags:    
Next Story
Share it
Top