Home > తెలంగాణ > Jeevan Reddy : కేసీఆర్ త్రీ ఫేజ్ కరెంట్ లాంటోడు.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevan Reddy : కేసీఆర్ త్రీ ఫేజ్ కరెంట్ లాంటోడు.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevan Reddy :  కేసీఆర్ త్రీ ఫేజ్ కరెంట్ లాంటోడు.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

కేసీఆర్ త్రీ ఫేజ్ కరెంట్ లాంటోడని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. నల్లగొండలో కేసీఆర్‌ సభను అడ్డుకుంటామన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ పై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామని చెప్పడం పిరికిపందచర్య అన్నారు. ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు ఈ ఏరియాలో ప్రెస్ మీట్ కూడా పెట్టని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆరోపించారు. అవగాహన లేని సన్నాసులు, చదువు లేని దద్దమ్మలు కృష్ణా జలాలను మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి అప్పగించడం చేతగానితనమని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ శాఖపై కనీస అవగాహన కూడా లేదని సెటైర్లు వేశారు.

తెలివి లేని సీఎంగా రేవంత్ రావడం ఇక్కడి ప్రజల దురదృష్టం అని ఎద్దేవా చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత నీటి సాగునీటిదని గుర్తు చేశారు. కృష్ణ బోర్డు అప్పగిస్తే రైతులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బ్రోకర్స్, జోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ బెదిరింపులు కొత్త కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కదిలి వచ్చినా కేసీఆర్ సభను అడ్డుకోలేరన్నారు. నల్లగొండలో సభ పెట్టి తీరుతామని అన్నారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపని అన్నారు.




Updated : 11 Feb 2024 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top