రాజనాల మళ్లి హల్ చల్.. అప్పుడు కోడీ, కోటర్.. ఇప్పుడు టమాటాలు
X
అసలే కేటీఆర్.. అందులో తెలంగాణ మంత్రి.. అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. అందులో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. మరి అలాంటి డైనమిక్ లీడర్ పుట్టిన రోజును సాదా సీదాగా జరిపితే కిక్కేముంటుంది. ఫ్యాన్య్ కు మాట రాదా. అందుకే సమ్ థింగ్ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజును నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. వరంగల్ లో జరిగిన మంత్రి కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
వరంగల్ బీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరి.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఘనంగా నిర్వహించారు. వరంగల్ చౌరస్తాలో బుట్టల్లో టమాటాలను ఉంచి ప్రజలకు పంచుతూ కేటీఆర్ పుట్టిన రోజును జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 200 మంది పేదలకు గులాబీ రంగు బుట్టల్లో కిలో చొప్పున టమాటాలు పంచిపెట్టారు.
గతంలో కూడా:
ఏ కార్యక్రమాన్ని అయినా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి.. వార్తల్లో నిలవడం రాజనాలకు అలవాటే. పోయిన ఏడాది దసరా పండుగ సందర్భంగా ప్రజలకు కోడి, మందు పంపిణీ చేసి వార్తల్లోకెక్కారు. ఇప్పుడు టామాటాలు పంచి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.