తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం
తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం
X
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సాయిచంద్ నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. అర్దరాత్రి సమయంలో ఆయనకు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నాగర్‌కర్నూల్‌లోని గాయత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగానే గుండెపోటుకు గురయ్యారు. అయితే సాయిచంద్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన భార్య రజనీ కోరడంతో వెంటనే హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు బీఆర్ఎస్ నేత. గుండెపోటుతోనే సాయిచంద్ మృతి చెందినట్లుగా గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి డాక్టర్లు నిర్ధారించారు. సాయిచంద్ మృతిపట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం, పార్టీ నేతల్లో పోరాట స్పూర్తిని కలిగిస్తూ వచ్చిన సాయిచంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.