ఇన్నాళ్లు ఆ రహస్యాన్ని ఎందుకు బయట పెట్టలేదు : వినోద్ కుమార్
X
కేసీఆర్పై మోదీ చేసిన వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. మోదీ వ్యాఖ్యలు నీటి మూటలన్నారు. ఇన్ని రోజులు ఆ రహస్యాన్ని ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్ను చూసి మోదీ భయపడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్కు ఎవరితో పొత్తులు అవసరం లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పొత్తులపై ఏ రాజకీయ పార్టీతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
అంతకుముందు నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిసిట్లు చెప్పారు. ఆ సమయంలో ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరారని.. దానికి తాను ఒప్పుకోలేదన్నారు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని.. అయితే మీరేమైనా రాజులా అని కేసీఆర్ను ప్రశ్నించినట్లు మోదీ తెలిపారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఆయన ముందు పెట్టానని స్పష్టం చేశారు. కేసీఆర్కు తన కళ్లలోకి చూసే ధైర్యం లేదని మోదీ ఎద్దేవా చేశారు.