Home > తెలంగాణ > ఔటర్ లాబీలో కేసీఆర్ ఛాంబర్.. బీఆర్ఎస్ అభ్యంతరం..

ఔటర్ లాబీలో కేసీఆర్ ఛాంబర్.. బీఆర్ఎస్ అభ్యంతరం..

ఔటర్ లాబీలో కేసీఆర్ ఛాంబర్.. బీఆర్ఎస్ అభ్యంతరం..
X

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ మార్పు వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్ష నేత కేసీఆర్కు చిన్న రూం కేటాయించడంపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఏండ్లుగా విపక్ష నేతకు కేటాయించే కార్యాలయాన్ని ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత గది మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలంగాణ మూడో అసెంబ్లీ తొలి సమావేశాల్లో ప్రతిపక్ష నేతకు కేటాయించిన రూంను ప్రస్తుతం వేరే వారికి కేటాయించారు. ఇంత వరకు ఇన్నర్ లాబీలో ఉన్న అపొజిషన్ లీడర్ ఆఫీసును ఔటర్ లాబీకి మార్చారు. ఈ మార్పుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు బీఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.

Updated : 8 Feb 2024 12:49 PM IST
Tags:    
Next Story
Share it
Top