BRS Leaders : 'చలో నల్గొండ' సభకు బీఆర్ఎస్ నేతలు
X
తెలంగాణలో కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ అందువల్ల కూలిందని గతంలోని కేసీఆర్ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు బయల్దేరి వెళ్లారు. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చలో నల్లగొండ సభకు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు పలువురు నాయకులు. pic.twitter.com/36PzxcSiwz
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2024
దీంతో నేడు నల్గొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు తెలంగాణ భవన్ నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు బస్సుల్లో బయల్దేరారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపేందుకే చలో నల్గొండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక బస్సులో నల్గొండకు బయల్దేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నల్లగొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ బృందం
— BRS Party (@BRSparty) February 13, 2024
పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి "ఛలో నల్గొండ" బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,… pic.twitter.com/KsdSWAQMSJ