Home > తెలంగాణ > బీఆర్ఎస్ అబద్దాలతో ప్రజల్ని మభ్యపెడుతోంది - సీఎం రేవంత్

బీఆర్ఎస్ అబద్దాలతో ప్రజల్ని మభ్యపెడుతోంది - సీఎం రేవంత్

బీఆర్ఎస్ అబద్దాలతో ప్రజల్ని మభ్యపెడుతోంది - సీఎం రేవంత్
X

అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ఓటమిపాలైన తర్వాత కూడా అబద్దాలతో ప్రజల్ని మభ్యపెడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. రైతు రాజ్యం అని చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. వారిని ఏనాడు ఆదుకోలేదని అన్నారు. వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్.. తన ఫాం హౌస్లోని 150 ఎకరాల్లో వరి వేశారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ ఫాం హౌస్లో పండిన వరికి రూ.4250 చెల్లించారని, దీనిపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతు ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని, అన్నదాత బతికున్నప్పుడు భరోసా ఇవ్వకుండా చనిపోయాక వెలకట్టారని సీఎం మండిపడ్డారు.

విద్యుత్ విషయంలోనూ బీఆర్ఎస్ అబద్దాలు చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పుకున్నారని, కానీ వాస్తవానికి రాష్ట్రం 10వ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. సాగునీటి విషయంలోనూ అబద్దపు ప్రచారం చేశారని మండిపడ్డారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పుకున్నారని, నిజంగా కాల్వల ద్వారా నీరందించి ఉంటే పంపు సెట్ల సంఖ్య 29లక్షలకు ఎందుకు పెరిగిందని నిలదీశారు. కృష్ణా జలాలు అందరికీ ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో పాలమూరు, చేవెళ్ల ప్రాంతాలపై వివక్ష కొనసాగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ను నమ్మి ఎంపీగా గెలిపించడమే పాలమూరు బిడ్డలు చేసిన నేరమా అని ప్రశ్నించారు. మిడ్ మానేరు ముంపు బాధితులు ఏండ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగలేదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇండ్ల పట్టాలు తీసుకున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు..

Updated : 16 Dec 2023 5:13 PM IST
Tags:    
Next Story
Share it
Top