Home > తెలంగాణ > ఖమ్మంలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సభ టైంలో పోస్టర్ల కలకలం

ఖమ్మంలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సభ టైంలో పోస్టర్ల కలకలం

ఖమ్మంలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సభ టైంలో పోస్టర్ల కలకలం
X

ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ రానుండగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి హస్తం కండువా కప్పుకుంటారు. ఈ సభను పెద్దఎత్తున నిర్వహించేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఖమ్మంలో పోస్టర్ల కలకలం రేగింది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులను బెదిరిస్తూ ఈ పోస్టర్లు కన్పించడం కాక రేపుతోంది. పొంగులేటి ఖబడ్దార్‌ అంటూ పోస్టర్లలో రాసి ఉండటం సంచలనంగా మారింది.





‘‘ఖమ్మం జిల్లా ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మంత్రి అజయ్ కుమార్ మీద కొంతమంది కావాలని చిల్లర కామెంట్లు చేస్తున్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, చీకటి కార్తీక్లు మంత్రి కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ శవాలు కూడా దొరకవు’’ అని ఆ పోస్టర్లలో ఉంది. కాగా తన ఆనుచరులకు వస్తున్న వార్నింగ్‌లపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నా అనుచరులను చంపుతామని బెదిరిస్తున్నారు. వార్నింగులకు భయపడేది లేదు. వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారు’’ అని పొంగులేటి స్పష్టం చేశారు.





మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య కారును వీడుతున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఒక జడ్పీటీసీ, 26మంది ఎంపీటీసీలు, 56మంది సర్పంచులు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.ఆదివారం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతామని కనకయ్య ప్రకటించారు. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభకు ఇల్లందు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరవుతారని చెప్పారు.




Updated : 1 July 2023 3:47 PM IST
Tags:    
Next Story
Share it
Top