Home > తెలంగాణ > బ్రేకింగ్.. మైనంపల్లి స్థానంలో మరొకరికి ఛాన్స్.. అధిష్టానం నిర్ణయమిదే..!!

బ్రేకింగ్.. మైనంపల్లి స్థానంలో మరొకరికి ఛాన్స్.. అధిష్టానం నిర్ణయమిదే..!!

బ్రేకింగ్.. మైనంపల్లి స్థానంలో మరొకరికి ఛాన్స్.. అధిష్టానం నిర్ణయమిదే..!!
X

మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే విషయంలో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్‌ నుంచి తన కుమారుడి(మైనంపల్లి రోహిత్)కి టికెట్‌ ఇవ్వాలని, లేకుంటే ఇండిపెండెంట్లుగా పోటీచేస్తామని హన్మంతరావు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.





దీంతోపాటు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి హరీశ్‌రావుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటలో హరీశ్ రావును ఓడిస్తా అని .. మెదక్ లో హరీశ్ రావు పెత్తనం ఏమిటని విమర్శించారు. హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసినా మైనంపల్లి హనుమంతరావుకు సీఎం కేసీఆర్... మరోసారి మల్కాజిగిరి నుంచి అవకాశం కల్పించారు. ఇదే విషయాన్ని విలేకర్లు ప్రశ్నించగా.. అందరు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.





గతంలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ లో ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు అక్కడ తన కుమారుడికి అక్కడ సీటు ఇవ్వాలని కోరారు. అయితే మెదక్ లో సిట్టింగ్ పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారని అధిష్ఠానం తేల్చి చెప్పింది. అయినా కూడా రెండు సీట్లు కావాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. పైగా హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మైనంపల్లిపై పార్టీ అధిష్ఠానం కన్నేర్ర చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయ పేర్లుగా మర్రి రాజశేఖర్ రెడ్డితో మరో రెండు పేర్లును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మర్రి రాజశేఖర్ రెడ్డి గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకే సీట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మైనంపల్లి, అతడి కుమారుడికి టికెట్ ఇస్తారా అనేది డౌట్ గానే ఉంది.




Updated : 23 Aug 2023 7:58 AM IST
Tags:    
Next Story
Share it
Top