Breaking News: పరేడ్ గ్రౌండ్స్‌లో రేపటి బీఆర్ఎస్ సభ రద్దు
X
పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ స్పీడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బహిరంగ సభలు నిర్వహించారు. వరుస ప్రచారాలతో జోష్ మీదున్న బీఆర్ఎస్‌కు వరుణుడు చిన్న బ్రేక్ ఇచ్చినట్లయింది . తాజాగా.. రేపు(నవంబర్ 25) గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల గెలుపు కోసం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సభకు ప్లాన్ చేశారు. అయితే, అనూహ్యంగా చివరి నిమిషయంలో సభ రద్దు అయింది. వర్షం కారణంగా రేపటి సభను రద్దు చేసినట్లు పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
ఇదిలా ఉండగా కేసీఆర్ ఈరోజు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులకు సపోర్టుగా గులాబీ అధినేత ప్రచారం చేయనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఈ సభా వేదికల్లో కేసీఆర్.. ప్రజలకు ఓటు హక్కును తెలియజేస్తున్నారు. మరోవైపు తొమ్మిదన్నరేళ్ల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి వివరిస్తున్నారు.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.