కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం, చేవెళ్ల ఎంపీ
X
గులాబీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మెజార్టీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టేసింది.
ఇందులో భాగంగా… ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండగా… తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన దానం నాగేందర్, ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. నేడు హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఆరూరి రమేశ్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.