Home > తెలంగాణ > ‘ కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ’పై సిట్టింగ్ ఎమ్మెల్యే స్పందన ఇదీ..

‘ కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ’పై సిట్టింగ్ ఎమ్మెల్యే స్పందన ఇదీ..

‘ కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ’పై సిట్టింగ్ ఎమ్మెల్యే స్పందన ఇదీ..
X

ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కొన్నాళ్లుగా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి ఆయన గజ్వేల్ నుంచి కాకుండా కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని అంచనాలు వెలువడుతున్నాయి. నిర్ణయం ఖరారైపోయిందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తనే స్వయంగా సీఎంను ఆహ్వానించినట్లు గోవర్ధన్ వెల్లడించారు. ‘‘కామారెడ్డిని మరింత బాగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్‌ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరాను. తమ సిట్టింగ్‌ స్థానాన్ని వదులుకోవడానికి ఏ ఎమ్మెల్యే కూడా ఇష్టపడడు. కానీ కామారెడ్డి మరింత అభివృద్ధి చెందడానికి నేను ఈ స్థానం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సీఎం మా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపు కోసం కార్యాకర్తగా పనిచేస్తాను. ఆయన మా మార్గదర్శి’’ అని గోవర్ధన్ చెప్పారు. గోవర్ధన్ మంగళవారం రాజంపేట మండలం ఆరేపల్లిలో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసి విలేకర్లతో మాట్లాడారు. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు గోవర్ధన్ శనివారం కూడా చెప్పారు. దీంతో గులాబీ దళపతి అక్కడి నుంచే పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు.



Updated : 8 Aug 2023 8:51 PM IST
Tags:    
Next Story
Share it
Top