Home > తెలంగాణ > BRS MLA Lasya Nandita : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్యే...కేసీఆర్ సభకు వెళ్లి వస్తుండగా ఘటన

BRS MLA Lasya Nandita : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్యే...కేసీఆర్ సభకు వెళ్లి వస్తుండగా ఘటన

BRS MLA Lasya Nandita : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్యే...కేసీఆర్ సభకు వెళ్లి వస్తుండగా ఘటన
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు రోడ్డు ప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. నల్గొండలో జరిగిన కేసీఆర్ మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. సభ అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. నార్కెట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు దెబ్బలు తగిలాయి. కాగా కారు ముందు వైపు కుడి భాగం బాగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె సోదరి, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. లాస్య నందిత దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.







Updated : 14 Feb 2024 1:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top