జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తారు?: కడియం శ్రీహరి
X
జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రక్రయ మొదలు కాలేదని అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో కడియం మాట్లాడారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ ఉద్యోగాలను ఏ రకంగా భర్తీ చేయబోతుందో బడ్జెట్ లో చెప్పలేదని అన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల క్రెడిట్ ను కాంగ్రెస్ తన బాక్స్ లో వేసుకోవడం సరికాదని అన్నారు. ఒక్క నోటిఫికేషన్ కు కూడా ఇవ్వకుండా తామే ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. తామే రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే తాము చెబుతున్నానని అన్నారు.
5 గ్యారెంటీలకు 53 వేల 196 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని, ఏ ఏ గ్యారెంటీకి ఎంత కేటాయించనున్నారో చెప్పాలని అన్నారు. నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4లక్షల 16 వేల ఇళ్లుల అవసరం పడుతాయని అన్నారు. ఈ ఇండ్లల్లో ఇంటికి రూ.5 లక్షల చొప్పున 23 వేల కోట్లు అవుతోందని అన్నారు. కానీ బడ్జెట్ లో పెట్టింది మాత్రం 7 వేల 700 కోట్లు మాత్రమేనని అన్నారు. ఈ ప్రకారంగా ఇందిరమ్మ ఇండ్లను ఎలా పూర్తి చేయబోతున్నారో చెప్పాలని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభయహస్తం కింది విద్యార్థులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం గురించి బడ్జెట్ లో చెప్పలేదని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు మస్తీ ఎక్కిందని అనడం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తగదని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు చాలా సంతోషపడ్డానని, అయితే కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ జాగ్రత్తగా ఉండాలని సెటైర్లు వేశారు. ఎస్సీల రిజర్వేషన్ ను 18కి శాతానికి పెంచుతామని అన్నారని, కానీ దాని గురించి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు.