లిఫ్ట్లో ఇరుక్కపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. బోయినపల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య నందిత లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కు పడిపోయి డోర్లు ఓపెన్ కాలేదు. దీంతో ఎమ్మెల్యే అందులో చిక్కుకుపోయారు. అయితే ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు బద్దలుకొట్టి.. ఎమ్మెల్యేను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో సాయన్న మరణించారు. సాయన్న మృతితో ఆయన కూతురైన లాస్య నందితకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ టికెట్ కోసం బీఆర్ఎస్ నేత క్రిశాంక్ తీవ్ర పోటీ పడినా.. అధిష్టానం లాస్యకే టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్పై లాస్య నందిత ఘన విజయం సాధించారు. లాస్యనందితకు 59057 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్‌కు 41,888 ఓట్లు వచ్చాయి.