BRS VS Congress | కాంగ్రెస్ నేతలను కాల్చి పడేస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
X
గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. మైనంపల్లి, బాల్క సుమన్ తమ వ్యాఖ్యలతో వార్తల్లో నిలవగా.. ఆ లిస్టులో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చేరారు. తెల్కపల్లి మండంలో పదేళ్ల ప్రజాప్రస్థానం పేరుతో యాత్ర నిర్వహించిన ఆయన.. ఒక్కసారిగా సహనం కోల్పోయి కాంగ్రెస్ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారు.
యాత్రలో భాగంగా మర్రి మాట్లాడుతుంటే కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అడ్డుతగిలారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన.. కాంగ్రెస్ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారు. అంతటితో ఆగకుండా తనను అడ్డుకుంటే కాల్చిపడేస్తా అని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తానని అన్నారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చేయి ఊడిపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరుతో అక్కడ కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.
కాగా కాంగ్రెస్పై మొన్న బాల్క సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసోళ్లు మనోళ్లే.. వాళ్లని ఏమనొద్దని అన్నారు. కొందరిని తామే కాంగ్రెస్ పార్టీలోకి పంపామని.. అందరూ మన దగ్గరికే వస్తారని సంచలన కామెంట్స్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటేష్ నేత కూడా తిరిగి బీఆర్ఎస్‌లోకే వచ్చారని.. మిగితావాళ్లు కూడా వస్తారని అన్నారు. రాజకీయాలు అన్నప్పుడు ఇలాంటివి నడుస్తాయ్ అని వ్యాఖ్యానించారు.