Home > తెలంగాణ > Padi Kaushik Reddy: కొత్త ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక పనికిరాని ముచ్చట్లు.. సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు

Padi Kaushik Reddy: కొత్త ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక పనికిరాని ముచ్చట్లు.. సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు

Padi Kaushik Reddy: కొత్త ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక పనికిరాని ముచ్చట్లు.. సీఎంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ఉద్యోగాల నియామకంపై సీఎం రేవంత్ సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారని, ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు తేదీని గుర్తు చేస్తూ... ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఆ సంగతి ఏమైందని, ఏమైనా మతిమరుపు వచ్చిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందు.. ఎన్నెన్నో హామీలు ఇచ్చి, ఇపుడు ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే హామీలు అమలు చేస్తామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. చేస్తానని చెప్పిన పనులు చేయకుండా.. తాము చేసిన మంచి పనులను రేవంత్(Revanth Reddy) తన ఖాతాలో వేసుకుంటున్నాడన్నారు.

హరీష్ రావుకు, నీకు పోలికా?

తమ పార్టీ అగ్రనేత హరీశ్ రావు(Harish Rao) శాపనార్థాలు పెడుతున్నాడంటూ విమర్శించిన సీఎంను ...హరీష్ రావుకు నీకు పోలికా ? అంటూ మండిపడ్డారు. హరీష్ రావు ఉదయం 6 గంటల నుంచి పని మొదలు పెట్టి రాత్రి రెండు గంటల వరకు ప్రజల కోసమే పని చేస్తారని అన్నారు. హరీష్ రావు శ్రమ వల్లే నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు సాకారం అయ్యాయని తెలిపారు. రేవంత్, కేసీఆర్ హయంలో ఏం జరగలేదంటే నిన్నటి కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేవారా ? అని ప్రశ్నించారు. తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే నా సవాల్

కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో మరెక్కడైనా, మరే ప్రభుత్వంలోనైనా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చి ఉంటె ముక్కు నేల కు రాస్తానన్నారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్ హయాంలో జరిగిన ఉద్యోగ నియామక వివరాలు వెల్లడిస్తామని..కాదని రేవంత్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక రేవంత్ పనికి రాని విషయాలు మాట్లాడుతున్నాడన్నారు. బిల్లా రంగాలకు ప్రతి రూపం రేవంత్ రెడ్డి అని..అందుకే ప్రతి రోజూ వాళ్ళ పేర్లు గుర్తుకు తెచ్చుకుంటున్నాడన్నారు. సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి.. మాజీ సీఎం కేసీఆర్ ను బొంద పెడతా అని మాట్లాడొచ్చా అని నిలదీస్తూ.. రేవంత్ సీఎం లా వ్యవహరించాలని, రౌడీ లా కాదని హితవు పలికారు. కేసీఆర్ పాలన లో లోపాలు వెతకడం మాని.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. ఇక ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్(MLA KCR) కు అభినందనలు తెలిపారు. కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోందని అన్నారు.

Updated : 1 Feb 2024 10:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top