Home > తెలంగాణ > కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు

కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు

కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు
X

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య మళ్లీ గొడవ మొదలైంది. శ్రీహరి కుటుంబ సభ్యులపై రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీహరి తండ్రి ఎస్సీ కాదని, దూదేకుల వ్యక్తిని పెళ్లాడిన ఆయన కుమార్తె కూడా ఎస్సీ కాదని అన్నారు. రాజయ్య శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రం తాటికొండ గ్రామంలో జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి ప్రసంగించారు. శ్రీహరి తండ్రి బైండ్ల కులస్థుడని, తల్లి ఎవరో ఏమిటో తెలుసని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నువ్వు నీతిమంతుణ్నని చెప్పుకుంటే సరిపోదు. నీ ఆస్తులెంతో చెప్పు నా ఆస్తులు చెబుతున్నా. నీ కూతురు ఏపీకి చెందిన దూదేకుల కులస్థుణ్ని పెళ్లాడింది, ఆమెఎస్సీ ఎట్లవుతుంది? ముస్లిం, మైనారిటీ సర్టిఫెకెట్ తెచ్చుకోవాలి’’ అని రాజయ్య అన్నారు.

దేవాదుల ప్రాజెక్టు తన ఘనదేనని శ్రీహరి చెప్పుకోవడం సరికాదని మండిపడ్డారు. ‘‘శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఆయనను సస్పెండ్ చేయాలి. 2014 నుంచి శ్రీహరి పార్టీని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వ నిధుల గురించి చెప్పకుండా దోచుకోమని చెప్తున్నారు’’ అని మండిపడ్డారు.


Updated : 7 July 2023 10:19 PM IST
Tags:    
Next Story
Share it
Top