Home > తెలంగాణ > ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై..  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు
X

కాంగ్రెస్‌లో చేరిన ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అనర్హత వేటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరామ‌ని తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతు తగిన చర్యలు తీసుకుంటామ‌ని స్పీక‌ర్ చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

ఒక పార్టీ త‌ర‌పున గెలిచి మ‌రో పార్టీలో చేరే ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను ఎలా తీసుకుంటారు అని ప్ర‌శ్నించారు. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌టం స‌రికాద‌ని రేవంత్‌పై కౌశిక్ రెడ్డి మండిప‌డ్డారు. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంక‌టేశ్, ముఠా గోపాల్, బండారు ల‌క్ష్మారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

Updated : 18 March 2024 1:17 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top