Home > తెలంగాణ > BRS MLAS : పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAS : పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS  MLAS : పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
X

పరువు నష్టం దావా కేసులో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మధురై కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్పై తీవ్ర ఆరోపణలు చేసిన కేసులో కోర్టుకు అటెండ్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు మాణిక్కం ఠాగూర్పై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ఆయన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించారు. సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆవరణలో సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలు కూర్చొని ఉన్న ఫొటోలను మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి నుంచి రూ. 25 కోట్లు తీసుకుని టీపీసీసీ చీఫ్ పోస్ట్ ఇప్పించారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2021 జులై3న మాణిక్కం ఠాగూర్పై సంచలన ఆరోపణలు చేశారు.పాడి కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇద్దరి కామెంట్లను సీరియస్ గా తీసుకున్న మాణిక్కం ఠాగూర్.. పరువు నష్టం దావా వేశారు. ఇద్దరికీ నోటీసులు పంపినా స్పందించకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలు మధురై కోర్టుకు హాజరయ్యారు.




Updated : 10 Jan 2024 2:54 PM IST
Tags:    
Next Story
Share it
Top