Home > తెలంగాణ > Telangana Assembly : అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

Telangana Assembly : అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

Telangana Assembly : అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
X

ఆరవ రోజున తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. అసెంబ్లీ జరుగుతుండగానే సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సానుభూతి కోసం వీధి నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్ష నేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అవినీతి బయటపడుతుందనే పారిపోయి ఫాంహౌస్‌లో వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత బాధ్యతను తప్పించుకున్నారని అన్నారు. నిజాయితీ ఉంటే అవినీతికి పాల్పడకుంటే మేడిగడ్డలో కుంగిన పిల్లర్లపైనిర్ణయం తీసుకునేలా చర్చించేందుకు సభకు రావాలని సవాల్ విసిరారు.

మేడిగడ్డలో వాస్తవాలపై చర్చకు పిలిచారు. సాగునీటి ప్రాజెక్టుపై శ్వేతపత్రం పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారం. ప్రతిపక్షం అభిప్రాయాలు శ్వేతపత్రంపై చర్చలో చెప్పుకోవచ్చని అన్నారు. కాళేశ్వరంపై ప్రత్యేకంగా సమయం కేటాయిస్తే చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బీఆర్ఎస్ సభ్యులు మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. సభా కార్యక్రమాలు జరుగుతుండగా మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని చెప్పారు.కొత్త నిబంధనలు ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.




Updated : 14 Feb 2024 7:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top