Home > తెలంగాణ > బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం నిర్ణయం..కాంగ్రెస్‎లోకి జంప్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం నిర్ణయం..కాంగ్రెస్‎లోకి జంప్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం నిర్ణయం..కాంగ్రెస్‎లోకి జంప్
X

తెలంగాణ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వలసలు ఎక్కువయ్యాయి. నాయకులు తమ భవిష్యత్‌పై దృష్టి సారించి కలిసొచ్చే పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్సీ బీఆర్ఎస్‌కు షాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఈనెల 20న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలోనే పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

దామోదర్ రెడ్డి పార్టీని వీడడంపై ఇప్పటికే వార్తలు రాగా ఆదివారం క్లారిటీ ఇచ్చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మీడియా ప్రశ్నలు అడగ్గా.. తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. విలువలు లేని చోట తాను ఉండలేనని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలన నిరంకుశ పాలనకు నిదర్శనమని విమర్శించారు. తన కుమారుడు ఒకచోట తాను ఒకచోట ఉంటూ చిల్లర రాజకీయాలు చేసే సంస్కృతి తనది కాదని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. అయితే బీఆర్ఎస్ లో కనీసం సమస్యలను చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదని దామోదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తో కలిసి ఏకాభిప్రాయంతోనే ముందుకెళ్తానని స్పష్టం చేశారు. టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించారు.


Updated : 9 July 2023 7:15 PM IST
Tags:    
Next Story
Share it
Top