Home > తెలంగాణ > తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్ తుపాకీ గురిపెట్టడం యాది చేసుకోండ్రి... కవిత

తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్ తుపాకీ గురిపెట్టడం యాది చేసుకోండ్రి... కవిత

తెలంగాణ ఉద్యమకారులపై రేవంత్ తుపాకీ గురిపెట్టడం యాది చేసుకోండ్రి... కవిత
X

కేసీఆర్ తెలంగాణకు మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దక్షిణ భారతంలో తొలి హ్యాట్రిక్ సాధిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ అంటే అభివృద్ధి గుర్తు, కేసీఆర్ అంటే ప్రేమకు పరాకకాష్ట, బీఆర్ఎస్ అంటే ఆత్మీయత..’’ అని ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె బుధవారం బోధన్‌లో ఎన్నికల ప్రచార నిర్వహించారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి మంత్రిగా పనిచేశారని, ఆయన ఒక్క చెరువుకు కూడా మరమ్మతులు చేయించి పాపాన పోలేదన్నారు.

కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు బతులకు ఆగమవుతాయని కవిత అన్నారు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు బిచ్చం అంటున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలను పట్టించుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. ‘‘తెలంగాణ అంతా గులాబీ హవా వీస్తోంది. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడిది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ ఉద్యమకారులు పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకి రావడాన్ని మర్చిపోతామా?’’ అని ఆమె అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీలు ఏం చెప్పినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయాలని కోరారు.

Updated : 15 Nov 2023 4:57 PM IST
Tags:    
Next Story
Share it
Top