కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
X
అసోం గువహటిలోని కామాఖ్య అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కవితకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కామాఖ్య అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. నాలుగైదు ఏండ్ల క్రితం ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నానని, తాజాగా కామాఖ్య దేవికి మళ్లీ పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ, దేశ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కామాఖ్య అమ్మవారిని కోరుకున్నట్లు కవిత చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సీఎం కేసీఆర్‌ని మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతలో విరజిల్లుతున్న భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందని, ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం తనకు కలగడం సంతోషంగా ఉందని కవిత ట్వీట్ చేశారు.
Stepping into the divine aura of Kamakhya Devi Temple, a beacon of strength, faith, and devotion.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 11, 2023
I prayed for the well-being, healthy life and prosperity of loved ones, well-wishers and the people of Telangana. pic.twitter.com/HFHNwlVSWO