Home > తెలంగాణ > గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్

గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్

గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్
X

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మోడీ సర్కారు ఇచ్చింది కానుక కాదు.. ప్రజలను జేబులను గుల్ల చేసి దగా చేయడంమని, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని అన్నారు. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కవిత మండిపడ్డారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్‌పై రూ.800 పెంచి తాజాగా కేవలం రూ.200 మాత్రమే తగ్గించిందంటూ కవిత ట్వీట్ చేశారు.

2014 నుంచి గ్యాస్ సిలిండర్‌ ధర పెంచుకుంటూ వెళ్లిన మోడీ సర్కార్‌.. తాజాగా రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది మహిళలకు రాఖీ కానుక అని ప్రకటించింది. దీనిపై సామాన్యులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. 2014లో రూ.400గా ఉన్న వంట గ్యాస్‌ ధర ప్రస్తుతం రూ.1100లకు చేరింది. ఇప్పుడు రూ.200 తగ్గించి మహిళలకు కానుక అనడం ఏంటని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.







Updated : 29 Aug 2023 5:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top