Home > తెలంగాణ > అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తా : కవిత

అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తా : కవిత

అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తా : కవిత
X

బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఎంపీలు బండి సంజయ్, అర్వింద్లపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటపడి ఓడిస్తానని అన్నారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేస్తే.. తాను అక్కడే పోటీచేస్తానని తెలిపిన కవిత.. తప్పకుండా అర్వింద్ ను ఓడిస్తానని తెలిపింది. నిజమాబాద్ తన సొంతూరు అన్న ఆమె.. నిజమాబాద్ నుంచే పార్లమెంట్ కు పోటీ చేస్తా అని స్పష్టం చేసింది.

‘‘అర్వింద్ కోరుట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని అంటుండట. ఆయన కోరుట్లకు పోతే అక్కడి పోయి ఓడిస్తా. ఎక్కడ పోతే అక్కడికి వెళ్లి ఓడిస్తా. అర్వింద్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫస్ట్ నువ్వు వాగడం తగ్గించుకో. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కౌంటర్ కూడా అదే స్థాయిలో ఉంటది’’ అని కవిత వార్నింగ్ ఇచ్చారు. అర్వింద్ ప్రజలనే కాకుండా తన సొంత పార్టీ నాయకులనే మోసం చేశాడని ఆరోపించారు. మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు.

కరెంట్ తీగలు పట్టుకో..

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై బండి సంజయ్ విషం చిమ్మారని కవిత మండిపడ్డారు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలే అని చెప్పారు. ‘‘24 గంట‌ల క‌రెంట్ ఎక్క‌డ వ‌స్తుంద‌ని సంజ‌య్ ప్ర‌శ్నించారు. క‌రీంన‌గ‌ర్ బీజేపీ ఆఫీసుకు లేదా హైద‌రాబాద్ బీజేపీ ఆఫీసుకు రా. రోజులో ఎప్పుడైనా కరెంట్ తీగలు ప‌ట్టుకో.. క‌రెంట్ వ‌స్తుందా లేదా తెలుస్త‌ది’’ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లో అబద్దాలు మాట్లాడడం సరికాదన్నారు.

నిజామాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యమని కవిత విమర్శించారు. వేల కోట్లతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ హబ్ తో జిల్లా దిశ మారుతుందని చెప్పారు. అర్వింద్ గెలుపుతో నిజామాబాద్ అభివృద్ధిలో 20ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. కేసీఆర్ కు పిండం పెట్టుడు కాదు.. ఆయనకే పిండం పెట్టడం ఖాయమని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టడం పక్కా అన్నారు.





Updated : 10 Aug 2023 8:35 PM IST
Tags:    
Next Story
Share it
Top