Home > తెలంగాణ > MLC Kavitha : రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి.. లేకపోతే కోర్టుకెళ్తాం : కవిత

MLC Kavitha : రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి.. లేకపోతే కోర్టుకెళ్తాం : కవిత

MLC Kavitha : రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి.. లేకపోతే కోర్టుకెళ్తాం : కవిత
X

(MLC Kavitha) కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని అన్నారు. కేసీఆర్ ను అసభ్య పదజాలంతో తిట్టిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే ఇప్పుడు రేవంత్ సర్కార్ అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందని విమర్శించారు.

సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పై సీఎం రేవంత్ అసభ్యంగా మాట్లాడితే ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఆయనపై కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామని చెప్పారు.

కాగా కేసీఆర్‌ను రం.. అన్న రేవంత్ రెడ్డే పెద్ద రం.. అని బాల్క సుమన్ అసభ్య పదజాలంతో దూషించారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉందని.. కానీ సంస్కారం అడ్డువస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కాంగ్రెస్ నేతల మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేశారు.


Updated : 6 Feb 2024 5:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top