శుభ పరిణామం.. అయోధ్య ఆలయంపై కవిత ట్వీట్..
X
అయ్యోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. వచ్చే నెలలో ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు రామాలయ ట్రస్ట్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆలయం నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. రామ్ లాల్లా కొలువుదీరనున్న గర్భగుడి చిత్రాలను ఇప్పటికే ట్రస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లేత గోధుమ రంగు శిలపై అందమైన పుష్పాలు, లతలతో గర్భగుడిని తీర్చిదిద్దారు. ఈ ఫొటోలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ‘‘అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట శుభ పరిణామం. కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయం. తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు’’ అని కవిత ట్వీట్ చేశారు. దీనికి ఆలయ వీడియోను జతచేశారు.
శుభ పరిణామం..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 10, 2023
అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట,
కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో...
తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు..
జై సీతారామ్ pic.twitter.com/qzH7M32cQJ