Home > తెలంగాణ > ఈడీ నోటీస్ కాదు.. మోదీ నోటీస్ : కవిత

ఈడీ నోటీస్ కాదు.. మోదీ నోటీస్ : కవిత

ఈడీ నోటీస్ కాదు.. మోదీ నోటీస్ : కవిత
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అది ఈడీ నోటీస్ కాదని మోదీ నోటీస్ అని అన్నారు. అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని వ్యాఖ్యానించారు. ఈ నోటీసులను తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని.. వారు ఎలా చెబితే అలా మందుకెళ్తామన్నారు.

‘‘ఈడీ నోటీసులు అందాయి. నోటీసుల‌ను మా పార్టీ లీగ‌ల్ సెల్‌కు పంపించాం. వారి సూచ‌న‌ల మేర‌కు ముందుకు వెళ్తాం. రాజ‌కీయ క‌క్ష్య‌తోనే నోటీసులు ఇచ్చిన‌ట్లు బ‌లంగా న‌మ్ముతున్నాం. తెలంగాణ‌లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నోటీసులు ఇచ్చారు. గ‌త ఏడాది నుంచి ఈ కేసులో ద‌ర్యాప్తు జరుగుతోంది. ఇంకెన్నాళ్లు ఈ విచార‌ణ సాగుతుందో తెలీదు. 2జీ కేసులో కూడా ఇంత కాలం విచారణ జ‌ర‌గ‌లేద‌నుకుంటా. ఇదంతా టీవీ సీరియల్ లాగా సాగుతోంది’’ అని కవిత అన్నారు.

తాము ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోలేదని కవిత స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ లేదా బీజేపీ బీ టీం కాదన్నారు. కేవ‌లం రాష్ట్ర, దేశ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యామ‌ని చెప్పారు. దేశ ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. దీంతో రెండు జాతీయ పార్టీల‌కు భ‌యం ప‌ట్టుకుందన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు.


Updated : 14 Sept 2023 7:23 PM IST
Tags:    
Next Story
Share it
Top