ఖర్గే ప్రకటన.. అర్రాస్ పాట పాడినట్లుంది : కవిత
X
కాంగ్రెస్, బీజేపీలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం అర్రాస్ పాట పాడినట్లు ఉందని సెటైర్ వేశారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కర్నాటకలో ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి ఉచిత పథకాలను ఎత్తేశారని ఆరోపించారు.
రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం ఆ సభకు అమిత్ షా రావడం.. హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని కవిత విమర్శించారు. రైతు బంధును కాపీ కొట్టిన మోదీ సర్కార్ 13కోట్లు మంది రైతులకు అని చెప్పి.. కేవలం 2.5 కోట్ల మందికే సాయం అందిస్తుందని ఆరోపించారు. కానీ రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు ఇస్తున్నామన్నారు. ఇక మోటర్లకు మీటర్లు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.
దళితులకు అండగా నిలిచింది కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని కవిత అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యుర్థులే లేరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. మూడోసారి కేసీఆర్ సీఎం ఖాయడమన్నారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీని గంప గోవర్దన్ నాలుగు సార్లు ఓడించారని ఈ సారి కేసీఆర్ ఓడిస్తారని అన్నారు.